Andhrapradesh,tirumala, సెప్టెంబర్ 19 -- తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 4 వేల మంది పోలీసులతో బ్రహ్మోత్సవాలకు భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 4 వేల సీసీ కెమరాలతో నిరంతరం నిఘా ఉంటుందని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రశాంత వాతావరణంలో బ్రహ్మోత్సవాల నిర్వహణకు పోలీసు శాఖ కృషి చేస్తుందని తెలిపారు.

భక్తుల భద్రత, సౌకర్యం కోసం సమగ్ర ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, క్యూ లైన్లలో క్రమశిక్షణ, అత్యవసర వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చ...