భారతదేశం, అక్టోబర్ 18 -- కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్య క్షేత్రంలో శ్రీవారి వైభవ ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభతో అత్యంత అట్టహాసంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కోటి సూర్యుల తేజస్సుతో భాసిల్లుతూ శ్రీ మలయప్పస్వామివారు సూర్యప్రభ వాహనంపై అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. శ్రీవారిని కళ్లారా తిలకించిన వేలాది మంది భక్తజనంలో భక్తిపారవశ్యం వెల్లివిరిసింది.

సూర్యభగవానుడు సకల జీవరాశులకు చైతన్యాన్ని, ప్రకృతికి వెలుగును, జీవకోటికి శక్తిని ప్రసాదించే ఆరోగ్యప్రదాతగా పూజలందుకుంటున్నాడు. సూర్యతేజంతోనే చంద్రుడు సైతం ప్రకాశిస్తున్నాడని పురాణాలు పేర్కొంటాయి.

సూర్యప్రభ వాహనంపై స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం(ఇవాళ)...