భారతదేశం, అక్టోబర్ 13 -- Tirumala Navaratri Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, కన్నులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన మంగళవారం (2026 అక్టోబరు 13) ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై అధిరోహించి, ద్వారకా శ్రీకృష్ణుడి విశేష అలంకారంలో భక్తకోటికి దివ్యదర్శనమిచ్చారు.

సర్వాలంకార భూషితుడైన స్వామివారి దివ్యమంగళ రూపాన్ని చూసి మాడ వీధుల్లో వేచి ఉన్న వేలాది మంది భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. వాహనసేవ ముందర గజాలు, అశ్వాలు రాజసంతో నడుస్తుండగా. భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాల సప్తస్వరాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గోవింద నామస్మరణలతో తిరుమల మాడ వీధులు మారుమోగాయి.

వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ...