భారతదేశం, నవంబర్ 26 -- తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ఏకంగా 121 కేజీల బంగారు ఆభరణాలను ఓ భక్తుడు కానుకగా అందజేశారు. వీటి విలువ సుమారు రూ.206 కోట్లుగా ఉంటుంది. తన కంపెనీలో 60 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ.6 వేల కోట్లకు పైగా పొందిన చెన్నైకి చెందిన వ్యాపారవేత్త.. తన వ్యాపార విజయానికి శ్రీవారి ఆశీస్సులే కారణమని భావించి ఈ భారీ కానుకను సమర్పించారు.

45 ఆభరణాలను 9 సెట్లుగా తయారుచేయించి శ్రీవారికి అందించారు. భక్తుడి నుంచి తిరుమలకు అందిన అతిపెద్ద బంగారు కానుకల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఇంతటి భారీ మెుత్తం ఆభరణాలు తిరుమలేశుడికి అందించినా.. తన పేరు మాత్రం బయటకు రావద్దని కోరుకోవడం విశేషం.

అయితే అతడు ఎన్ఆర్ఐ అని ప్రచారం కూడా సాగుతోంది. ఈ కానుకలో మూలవిరాట్, ఉత్సవ విగ్రహాలను అలంకరించడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన, తొమ్మిది సెట్లుగా అమర్చిన 45 బంగారు...