భారతదేశం, నవంబర్ 21 -- తిరుమల శ్రీనివాసుడికి ఓ భక్తుడు భారీ మెుత్తం బంగారం కానుకగా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 121 కిలోల బంగారాన్ని స్వామివారికి అందించనున్నారు. మెుత్తం 9 సెట్లుగా 45 ఆభరణాలను ఆ భక్తుడు ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ కానుక విలువ సుమారు 160 కోట వరకు ఉంటుందని అంచనా. తిరుమల చరిత్రలో స్వామివారికి ఇదే అతిపెద్ద కానుక కానుంది. నవంబర్ 26వ తేదీన కానుకలను టీటీడీ అందించనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. దేశవిదేశాల నుంచి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అమ్మవారి వాహనసేవలు, దర్శనాల ద్వారా ఆధ్యా...