తిరుమల లడ్డూ కల్తీ కేసు.. ఏపీ వెలుపల విచారణ బదిలీకి సుప్రీంకోర్టు నో
భారతదేశం, నవంబర్ 5 -- సంచలనం సృష్టించిన తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుపలికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసు విచారణ ఏపీలోనే కొనసాగుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భారత్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది.
ఈ కేసులోని ప్రధాన నిందితుల్లో ఒకరైన మహారాష్ట్రకు చెందిన డెయిరీ వ్యాపారి మచింద్ర శాంతారామ్ లాంకే దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దేవ్ తన వాదనలను వినిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వాతావరణం తీవ్ర రాజకీయ వేడితో కూడుకుని ఉందామని, అక్కడ నిష్పాక్షిక విచారణ జరగడం కష్టమని దే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.