Andhrapradesh, సెప్టెంబర్ 26 -- తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదం కల్తీ కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవలే ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరపగా. కీలక వ్యాఖ్యలు చేసింది.

చిన్నప్పన్నకు సిట్ లో లేని అధికారి నోటీసు ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమించడమేనని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు. దర్యాప్తును బలహీనపరచడమే కాకుండా, సిట్ పన...