భారతదేశం, నవంబర్ 25 -- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను డిసెంబర్ 6 నుంచి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు జరిగే పంచమితీర్థానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా బుధవారం తిరుమల నుంచి తిరుచానూరుకు శ్రీవారి పడి సారెను తీసుకువచ్చే ఊరేగింపు మార్గంలో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం తిరుచానూరులోని తోళప్ప గార్డెన్స్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశమై బ్రహ్మోత్సవాలు, పంచమితీర్థం ఏర్పాట్లపై జేఈవో సమీక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, భద్రత, తాగునీరు, వైద్య సదుపాయాలు, రవాణా వంటి అంశాలపై దిశానిర్దేశం...