భారతదేశం, అక్టోబర్ 14 -- Tirumala Navaratri Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన బుధవారం(ఇవాళ) ఉదయం శ్రీ మలయప్పస్వామివారు దివ్యమైన సింహ వాహనంపై యోగ నరసింహస్వామి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. గంభీరమైన సింహ వాహనంపై కొలువుదీరిన స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తజనం పరవశించిపోయారు. తిరుమాడ వీధులన్నీ గోవింద నామస్మరణలతో, హరినామ సంకీర్తనలతో మారుమోగిపోయాయి.

మాడ వీధుల్లో సాగిన ఈ వాహనసేవ భక్తులకు కన్నులపండువగా నిలిచింది. ఊరేగింపు ముందుగా గజరాజులు గంభీరంగా నడుస్తుండగా, భక్తబృందాల భజనలు, ఉత్సాహంగా సాగిన కోలాటాలు, శ్రీవైష్ణవ జీయంగార్ల వేదఘోష, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు అత్యంత వేడుకగా సాగింది. తిరుమల పురవీధులన్నీ భక్త...