భారతదేశం, ఆగస్టు 21 -- శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఒక నెల ముందుగానే ఈ పనులు చేపట్టగా... తాజాగానే పన్నులన్నీ పూర్తయ్యాయి. బుధవారం నుంచి పుష్కరిణి అందుబాటులోకి తీసుకొచ్చామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఓ ప్రకటనలో పేర్కొంది.

స్వామివారి పుష్కరిణి మరమ్మ‌తు పనులు పూర్తయి కొత్త హంగులతో తీర్చిదిద్దబడిందని టీటీడీ తెలిపింది.కాగా ఈ మర‌మ్మ‌తు పనులు జూలై 20 తేదిన ప్రారంభించిన విషయం విదితమే. ఇందులో భాగంగా స్వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి... నీటి అడుగ భాగంలో పేరుకున్న ఇసుకను తొలగించారు. పాచిని తొలగించడానికి వాటర్‌వర్క్స్ విభాగంలోని దాదాపు 100మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యమ్రాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా స్వామి పుష్కరిణి మెట్లకు ఆ...