తిరుమల : శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ - ఇవాళ పలు సేవలు రద్దు
భారతదేశం, నవంబర్ 16 -- తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ (నవంబర్ 16) జరగనున్న వార్షిక పుష్పయాగానికి ఆదివారం రాత్రి వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయంలోని యాగశాలలో అర్చకులు ఈ వైదిక క్రతువును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అంకురార్పణ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రద్దు చేసింది.
పుష్పయాగ మహోత్సవాలకు ముందుగా ఆదివారం ఉదయం శ్రీవారి ఆలయంలోని మూలవిరాట్ ఎదురుగా ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. వైదిక కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందుకు అర్చకులకు వివిధ బాధ్యతలు అప్పగించడాన్నే ఋత్విక్‌వరణం అంటారు. సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞతోనే తమకు ఈ విధులు దక్కాయని అర్చకులు భావిస్తారు.
అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీవారి సేనాధిపతి శ్రీ విష్వక్సేనుల వారిని ఆలయం నుంచి వసంత మండపానికి ఊరేగింపుగా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.