భారతదేశం, జనవరి 4 -- టీటీడీ స్థానిక, అనుబంధ ఆలయాల ప్రాశస్త్యాన్ని భక్తులకు అందించేందుకు వర్చువల్ రియాలిటీ సహకారం తీసుకోవాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ. టీటీడీ స్థానిక, అనుబంధ ఆలయాల ప్రాశస్త్యం, శిల్ప సౌందర్యం తదితర ప్రధాన అంశాలను భక్తులకు చేరవేసేందుకు అవసరమైతే ఆగుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ సాయం తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ ను రూపొందించే అంశాన్ని పరిశీలించాలన్నారు.
ఆలయాల శిల్పాలు, చిత్రాలను భక్తులు సెల్ ఫోన్ తో స్కాన్ చేసినట్లు అయితే సంబంధిత పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా నూతన టెక్నాలజీతో అనుసంధానం చేయాలని సూచించారు. అదేవిధంగా తిరుమల శ్రీవారి ఆలయం కైంకర్యాలను ఎస్వీబీసీ ఛానల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.