భారతదేశం, డిసెంబర్ 20 -- తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించనున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దర్శనాలను పురస్కరించుకుని డిసెంబర్ 23వ తేదీ మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందుకు సంబంధించి టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.
సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
డిసెంబర్ 23వ తేదీ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ కారణంగా అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేయడం జరిగింది.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నేపథ్యంలో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.