తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవ శోభ - విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా తిరుగిరులు
భారతదేశం, సెప్టెంబర్ 18 -- Tirumala Srivari Salakatla Brahmotsavams : తిరుమలలో వైభవంగా జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల శోభ తిరుపతి నగరంలోనూ వెల్లివిరుస్తోంది. శ్రీవారి వాహనసేవలను వీక్షించేందుకు తరలివచ్చే భక్తులకు తిరుపతిలోనే భక్తి, ఆధ్యాత్మికత, ఉత్సవ వైభవంతో కూడిన ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేలా టీటీడీ విస్తృతంగా విద్యుద్దీపాలంకరణలు చేపట్టింది.
తిరుపతి నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, టీటీడీ భవనాలు, పార్కింగ్ ప్రాంతాలు, హోల్డింగ్ పాయింట్లు తదితర ప్రాంతాలు రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా మారాయి. ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ అలంకరణలు రాత్రివేళ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
తిరుపతిలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్వాగత తోరణాలతోపాటు, శ్రీవారి దశావతారాలు, మహావిష్ణువు, శ్రీమహాలక్ష్మీ స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.