భారతదేశం, సెప్టెంబర్ 27 -- కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా, నేత్రపర్వంగా జరిగింది. పౌర్ణమి తిథిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు సర్వాలంకార భూషితుడై గరుడ వాహనంపై వేంచేశారు. తిరుమాడ వీధుల్లో అత్యంత శోభాయమానంగా జరిగిన ఈ ఊరేగింపులో స్వామివారు భక్తకోటికి దివ్య దర్శనమిచ్చి కటాక్షించారు. ఆలయ మాడ వీధులంతా గోవింద నామస్మరణలతో మారుమోగాయి.

హిందూ పౌరాణిక నేపథ్యంలో, ముఖ్యంగా 108 వైష్ణవ దివ్యదేశాలలో గరుడసేవకు అత్యంత ప్రాధాన్యత మరియు విశిష్ఠత ఉంది. భగవంతునికి, భక్తునికి మధ్య అనుసంధానకర్తగా ఉండే గరుడ వాహనం ద్వారా స్వామివారు తన దాసానుదాస ప్రపత్తికి తాను సర్వవేళలా దాసుడనని లోకానికి చాటిచెబుతారు.

జ్ఞానము, వైరాగ్యము అనే రెక్కల...