తిరుమలలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం - ముత్యపు కవచంలో శ్రీవారి దర్శనం
భారతదేశం, జూన్ 27 -- కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి జ్యేష్ఠాభిషేక వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు అపురూపమైన ముత్యపు కవచాన్ని ధరించి భక్తులను మురిపించారు. ఏడాది పొడవునా వివిధ కవచాల్లో దర్శనమిచ్చే స్వామివారు, సంవత్సరంలో కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే ఈ ముత్యపు కవచాన్ని అలంకరించుకోవడం ఈ వేడుక ప్రత్యేకత.
అంతకుముందు శనివారం ఉదయం 6.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. అనంతరం ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా 'మహాశాంతి హోమం' నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారికి, దేవేరులకు అభిదేయక అభిషేకాన్ని అర్చకులు కన్నులపండుగగా చే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.