భారతదేశం, అక్టోబర్ 8 -- వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి.. అన్న దైవ స్తోత్రానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచే తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల ఆకలి తీర్చే అన్నపూర్ణ నిలయంగా భాసిల్లుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు శ్రీవారి కృపతో పాటు టీటీడీ నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద సేవ అక్షయ పాత్రలా కొనసాగుతోంది.

తిరుమలలో ఆకలితో ఉన్న భక్తుడికి అన్నం అందించడమే లక్ష్యంగా టీటీడీ అన్నప్రసాదం విభాగం 24 గంటలూ నిరంతరం పనిచేస్తోంది. సాధారణ రోజుల్లో సుమారు 1.80 లక్షల నుంచి 1.90 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుండగా, రద్దీ రోజులు, వారాంతాల్లో ఈ సంఖ్య 3 లక్షలకు మించుతోంది. పానీయాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కల...