భారతదేశం, డిసెంబర్ 18 -- తిరుమలలో తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు ఓవరాక్షన్ చేశారు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం కూడా సీరియస్ అయింది. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ఇంతకీ ఏమైందంటే.. తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు తమిళనాడు భక్తులు అన్నా డీఎంకే ఫ్లెక్సీతో వచ్చారు. దీనితో కాసేపు హల్చల్ చేశారు. ఫ్లెక్సీని ప్రదర్శించి, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అన్నా డీఎంకేకు సంబంధించి.. జయలలిత, పళని స్వామి, ఇతర నేతల ఫొటోలు ఉన్న ఫ్లెక్సీని తిరుమలకు తీసుకొచ్చారు. ఆలయం దగ్గరలో ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ.. వీడియో తీసుకున్నారు. ఫొటోలు దిగారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై టీటీడీ స్పందించింది. 'తమిళనాడుకు చెందిన కొందరు వ్యక...