భారతదేశం, డిసెంబర్ 17 -- తిరుమల వెళ్లిన భక్తుల్లో చాలా మంది శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తారు. రోజుకు వేల సంఖ్యలో భక్తులు తలనీలాలు ఇస్తారు. అయితే ఇందుకోసం ఎన్ని వేల బేడ్లు ఉపయోగిస్తారో తెలిసింది. ఓ సంస్థ టీటీడీకి బ్లేడ్లను విరాళంగా అందించింది. ఈ సందర్భంగా ఈ విషయం తెలిసింది.

హైదరాబాద్‌కు చెందిన వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోడుపల్లి టీటీడీకి ఏడాదికి సరిపడా రూ.1.20 కోట్లు విలువైన సిల్వర్ మాక్స్ హాఫ్ బ్లేడ్లలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు బ్లేడ్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ భక్తులు తలనీలాలు సమర్పించేందుకు బ్లేడ్ల కోసం టీటీడీ ఏడాదికి రూ.1.16 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రోజుకు 40 వేల హాఫ్ బ్లేడ్లను కల్యాణకట్టల్ల...