భారతదేశం, జూన్ 16 -- శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు టీటీడీ విస్తృత స్థాయిలో లగేజీ డిపాజిట్ మరియు డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహిస్తోంది. భక్తులు శ్రీవారి దర్శనం, కాలినడక యాత్ర సమయంలో తమతో తీసుకువచ్చే లగేజీ, బ్యాగులు, సెల్ ఫోన్లను భద్రంగా ఉంచుకునేందుకు తిరుమలలో, కాలినడక మార్గాల్లో కలిపి మొత్తం 65 కౌంటర్లు ఏర్పాటు చేసి 345 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరంగా సేవలందిస్తున్నారు.

టీటీడీ కల్పించిన ఈ సేవలను భక్తులు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెల‌ల్లో రికార్డు స్థాయిలో 51,38,976 మంది భ‌క్తులు త‌మ ల‌గేజీని డిపాజిట్ చేసుకున్నారు. గ‌త ఏడాది ఏప్రిల్ లో 20,75,481 మంది భ‌క్తులు త‌మ ల‌గేజీని భ‌ద్రప‌ర‌చుకోగా, ఈ ఏ...