భారతదేశం, సెప్టెంబర్ 25 -- తిరుమలలో వేంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయం(పీఏసీ5)ను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన వసతిగృహంలో తొలి బుకింగ్ టోకెన్‌ను భక్తులకు అందించారు. రూ.102 కోట్లతో నూతన కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. ముందస్తుగా బుకింగ్ లేకున్నా.. భక్తులకు వసతి కల్పించేలా ఇందులో ఏర్పాట్లు ఉంటాయి. ఒకేసారి 4 వేల మందికి ఉచిత సౌకర్యం కల్పిస్తారు. 16 డార్మిటరీలు, 2400 లాకర్లు, 24 గంటలు వేడి నీటి సౌకర్యం కూడా ఉంటాయి.

వేంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయం ప్రాంగణంలో ఒకేసారి 1400 మంది భోజనం చేయడానికి వీలు కల్పించేలా రెండు డైనింగ్ హాల్స్ ఉన్నాయి. అంతేకాదు ఒకేసారి 80 మంది తలనీలాలు సమర్పించేలా కల్యాణకట్టను నిర్మించారు.

బుధవారం రాత్రి భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారిని ...