భారతదేశం, అక్టోబర్ 2 -- తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి రోజునకు చేరుకున్నాయి. ఇవాళ్టితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటలకు వేడుకగా పల్లకి ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం జరిగింది. అనంతరం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య శ్రీదేవి భూదేవి, చక్రత్తాళ్వార్ సమేతంగా ఉన్న మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులకు అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించారు.

వేలాది మంది భక్తులు పుష్కరిణిలో పవిత్ర స్నానమాచరించారు. గోవిందా.. గోవిందా అని భక్తి పారవశ్యంతో శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు పవిత్ర అభిషేకాన్ని వీక్షించడానికి టీటీడీ పుష్కరిణి మండపానికి నాలుగు వైపులా ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసింది. ఆలయ నాలుగు మాడవీధుల్లో 23, పుష్కరిణిలో 4, ...