భారతదేశం, అక్టోబర్ 5 -- సీనియర్ సిటిజన్ల దర్శనంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై టీటీడీ స్పందించింది. వయోవృద్ధుల దర్శనంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మకూడదని శ్రీవారికి భక్తులకు దేవస్థానం తెలిపింది. వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనానికి సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజం లేదని ప్రకటన విడుదల చేసింది.

రోజూ 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తుందని తెలిపింది. టికెట్ తీసుకున్న వ్యక్తికి రూ.50 లడ్డూ ఉచితంగా ఇస్తుందని పేర్కొంది. తిరుమల నంబి ఆలయానికి ఆనుకొని ఉన్న సీనియర్ సిటిజన్, పీహెచ్‌సీ లైన్ ద్వారా రోజూ మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుందని వెల్లడించింది. సామాజిక మధ్యమాల్లో వచ్చే వార్తలు, వదంతులు నమ్మకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ...