Andhrapradesh,tirumala, సెప్టెంబర్ 28 -- తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ అత్యంత కీలకమైన గరుడ వాహన సేవ సాయంత్రం నిర్వహించనున్నారు. ఇప్పటికే కొండ మీద లక్షకు పైగా భక్తుల సంఖ్య దాటింది. దాదాపు 2 లక్షల మంది వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. 5 వేల మంది భద్రతా సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశారు.

గరుడ వాహన సేవకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. తిరుపతి - తిరుమల మధ్య నిమిషానికో ఆర్టీసీ బస్సు నడిచేలా ఏర్పాటు చేశారు. దాదాపు రెండున్నర లక్షల మంది ప్రయాణించేలా బస్సులను నడపనున్నారు.

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ అత్యంత వైభవంగా చేస్తారు. ఆరోజు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తుల...