భారతదేశం, నవంబర్ 26 -- సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలుపై రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 20 బోగీలతో పరుగులు పెట్టనుంది. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే (నవంబర్ 27, 2025) అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
తిరుపతి - సికింద్రాబాద్ మధ్య ఇప్పటి వరకు 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్, 14 ఏసీ చైర్కార్లతో కలిపి మొత్తం 16 బోగీలతో నడిచేది. ప్రయాణికుల విజ్ఞప్తుల నేపథ్యంలో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి.
రైల్వే శాఖ తాజా నిర్ణయంతో మరో 4 ఏసీ చైర్కార్లను శాశ్వత ప్రాతిపదికన జోడించనున్నారు. ఫలితంగా ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 312 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కాగా ఈ మార్గంలో వందే భారత్కు స్టాపేజీలు, వేళల్లో ఎటువంటి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.