భారతదేశం, మే 6 -- తిరుపతిలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర రామ్నారాయణ్ రుయా (SVRR) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ కార్యాలయం పరిధిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఎటువంటి రాత పరీక్ష లేకుండా, కేవలం వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

మీరు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందించాలనుకుంటే.. ఈ అవకాశాన్ని ఏమాత్రం చేజార్చుకోకండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 06 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వివిధ రకాల నైపుణ్యాలు కలిగిన వారికి ఇందులో అవకాశం ఉంది. పోస్టుల పేరు, ఖాళీల సంఖ్య చూడండి.

పోస్టును బట్టి అర్హతలు మారుతుంటాయి. పదో తరగతి (10th) ఉత్తీర్ణత నుండి ఎంబీబీఎస్ (MBBS) చదివిన వారి వరకు అందరికీ అవకాశా...