భారతదేశం, సెప్టెంబర్ 15 -- తిరుపతిలో అన్ని సౌకర్యాలతో ఉండేలా బస్ స్టేషన్ ఉండేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. తిరుపతిలో రోజుకు లక్ష మంది ప్రయాణికులకు సేవలు అందించగల కొత్త బస్ స్టేషన్ డిజైన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులతో సమీక్షా నిర్వహించారు.

తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బస్ స్టేషన్ నిర్మించాలని, భవిష్యత్తు అవసరాలను తీర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కొత్త బస్ స్టేషన్ 13 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఒకేసారి 150 బస్సులను ఉంచగల బస్ బే కలిగి ఉంటుంది. హెలిప్యాడ్, రోప్‌వే, వాణిజ్య సముదాయాలు, మాల్స్, మల్టీప్లెక్స్‌లు, సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలు ప్రణాళికలో ఉన్నాయి.

ఈ స్టేషన్‌లో ట్రాఫిక్ సజావుగా సాగే...