భారతదేశం, నవంబర్ 23 -- పవిత్ర కార్తీక మాస శోభను మరింత పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నవంబర్ 30వ తేదీన తిరుపతిలో కార్తీక మహాదీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. స్థానిక టీటీడీ పరిపాలనా భవన ప్రాంగణంలోని పరేడ్ మైదానం ఈ ఆధ్యాత్మిక వేడుకకు వేదిక కానుంది. సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8.45 గంటల వరకు భక్తిప్రపత్తులు వెల్లివిరిసేలా విశేష పూజలు, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను టీటీడీ అధికారులు రూపొందించారు.

మహాదీపోత్సవంలో భాగంగా కార్తీక దీప ప్రజ్వలన విశిష్టతను చాటుతూ వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తొలుత శ్రీనివాస అర్చన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శ్రీ మహాలక్ష్మీ పూజలను భక్తిశ్రద్ధలతో జరిపిస్తారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ...