భారతదేశం, డిసెంబర్ 18 -- బాలీవుడ్, టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్నూ, మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడటంలో ముందుంటారు. తాజాగా ఆమె హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన రింగుల జుట్టు వల్ల ఎదురైన ఇబ్బందులను పంచుకున్నారు. వెండితెరపై 'గ్లామర్' అంటే కేవలం జుట్టు నిటారుగా (Straight) ఉండటమే అనే మూస ధోరణి తనను ఎలా బాధించిందో ఆమె వివరించారు.

కెరీర్ మొదట్లో ప్రతి దర్శకుడు తనను జుట్టు స్ట్రెయిట్ చేయించుకోమని అడిగేవారని తాప్సీ తెలిపారు.

గ్లామర్ అంటే స్ట్రెయిట్ హెయిర్: "చాలా కాలం వరకు దర్శకులు గ్లామరస్ లేదా సెక్సీ లుక్ అంటే కేవలం స్ట్రెయిట్ హెయిర్ మాత్రమే అనుకునేవారు. నా రింగుల జుట్టు కేవలం 'రెబెల్' (తిరుగుబాటు) పాత్రలకే సరిపోతుందని, మంచి అమ్మాయి పాత్రలకు పనికిరాదని భావించేవారు" అని తాప్సీ చెప్పుకొచ్చారు.

ఆ ...