భారతదేశం, మార్చి 27 -- తాడిపత్రి నియోజకవర్గం యాడికి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడి కిడ్నాప్ ఆ తర్వాత హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసుల కాల్పులు చేసినట్టుగా తెలుస్తోంది.

కోనఉప్పలపాడులో ఏడేళ్ల బావమరిది వేంచంద్రను బావ సర్వేశ్‌కుమార్‌ కిడ్నాప్ చేశాడు. కుందనకోట గ్రామం వద్ద బాలుడిని గొంతు నులిమి, రాయితో కొట్టి కిరాతకంగా హత్య చేశాడు నిందితుడు. అయితే సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం ఘటనాస్థలానికి వెళ్లిన సమయంలో పోలీసులపై నిందితుడు తిరగబడి బీర్ బాటిల్‌తో దాడి చేశాడు. పోలీసులు ఎంత చెప్పినా వినలేదు. చెత్త కుప్ప పక్కన ఉన్న బీర్ బాటిల్ తీసుకొని.. పోలీసులపై దాడికి దిగాడు సర్వేశ్. వెంటనే పోలీసులు అప్రమత్తయ్యారు. ఆత్మరక్షణలో భాగంగా ...