భారతదేశం, అక్టోబర్ 28 -- తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి చర్యలు చేపడుతోంది. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఉల్లంఘనలు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ పరిధిలో తాగునీటిని వృథా చేసిన ఓ నివాసానికి రూ.5 వేల జరిమానా విధించింది.

జూబ్లీహిల్స్ సర్కిల్, జూబ్లీహిల్స్ వార్డు పరిధిలోని రోడ్ నంబర్ 57, ప్లాట్ నంబర్ 1152లో తాగునీటిని ఇంటి ప్రాంగణం శుభ్రపరిచేందుకు వినియోగిస్తున్నట్లు స్థానికులు జలమండలి వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన నేపథ్యంలో జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేపట్టారు. అక్కడ తాగునీటి దుర్వినియోగం జరుగుతున్నట్లు నిర్ధారించుకుని, సంబంధిత నివాసానికి రూ.5 వేల జరిమానా విధించారు.

ఫిర్యాదు స్వీకరణ నుంచి క్షేత్రస్థాయి విచారణ, ఉ...