భారతదేశం, నవంబర్ 26 -- మనం ప్రతిరోజూ తీసుకునే ప్రాథమిక అవసరాల్లో నీరు ఒకటి. కానీ క్లినిక్‌లో రోగులను నీటి నాణ్యత గురించి అడిగే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. తాగునీటి నాణ్యత జీర్ణ ఆరోగ్యంపై నిశ్శబ్దంగా ప్రభావం చూపుతుందనే విషయాన్ని వైద్యులు ఇప్పుడు మరింతగా గుర్తిస్తున్నారు.

నగరాలు, పట్టణాల్లో బోరు నీరు, మున్సిపల్ నీరు, వాటర్ ట్యాంకర్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, నీటి శుద్ధి, నిల్వ పద్ధతులపై అవగాహన అవసరం. హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్, థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్ డాక్టర్ డి. చంద్రశేఖర్ రెడ్డి తాగునీటి కలుషితంతో పేగు ఆరోగ్యానికి కలిగే ముప్పుపై పలు విషయాలు పంచుకున్నారు.

మన పేగులో లక్షల కోట్ల సంఖ్యలో మేలు చేసే బ్యాక్టీరియా నివసిస్తాయి. ఇవి ఆహారం జీర్ణం కావడానికి సాయపడతాయి, విటమిన్లను ...