భారతదేశం, నవంబర్ 17 -- పొట్టకూటి కోసం వలస వచ్చిన చోట.. అండగా ఉండాల్సిన బంధువుల మధ్యే చిచ్చు రేగింది. ఆర్థిక లావాదేవీలకు తోడు, తల్లిని అసభ్యంగా దూషించాడన్న ఆగ్రహం ఓ బాలుడిని కర్కశుడిగా మార్చింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఆ 17 ఏళ్ల బాలుడు, తనతో పాటు పనిచేస్తున్న బంధువును అత్యంత దారుణంగా హతమార్చాడు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవుషాపూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘట్‌కేసర్ సీఐ పి. కిరణ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడు బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వచ్చాడు. ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్ గ్రామ పరిధిలోని జగత్ స్వప్న స్పార్కిల్ క్యాసిల్ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనికి కుదిరాడు. అక్కడే తన బంధువైన శివ అనే యువకుడితో ...