భారతదేశం, మార్చి 29 -- తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వృద్ధులైన తల్లిదండ్రుల సంక్షేమాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో 'తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం మరియు పర్యవేక్షణ బిల్లు-2026'ను ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు ఆమోదం లభించింది.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో ఉన్న పిల్లలు.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను తీసుకునేలా చూడటమే ఈ బిల్లు లక్ష్యం. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ఖజానా నుండి జీతాలు పొందుతున్న ఇతర సంస్థల ఉద్యోగులు తమ తల్లిదండ్రులను చూసుకోవడంలో విఫలమైతే, వారి జీతంలో 15 శాతం కోత విధిస్తారు. ఈ కోతను నేరుగా వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు.

సహాయం కోరుకునే తల్లిదండ్రులు ఒక ప్రత్యేక అధికారికి, సాధారణంగా జిల్లా కలెక్టర్‌కు, అధికా...