భారతదేశం, జనవరి 10 -- పిల్లల్లో అలెర్జీలు, గవత జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధుల చికిత్సకు సాధారణంగా సూచించే ఆల్మాంట్-కిడ్ సిరప్ వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
పిల్లల కోసం వినియోగించే అల్మాంట్-కిడ్ (Almont-Kid) సిరప్‌లో మోతాదుకు మించి ప్రమాదకర రసాయనాలు (ఇథిలీన్ గ్లైకాల్) ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ సిరప్‌ను వాడొద్దని తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) ప్రజలను హెచ్చరించింది. బిహార్‌కు చెందిన ట్రిడస్ రెమెడీస్ సంస్థ తయారు చేసిన AL-24002 బ్యాచ్ సిరప్‌లలో కల్తీ జరిగినట్లు బెంగాల్లో గుర్తించారు. ఈ బ్యాచ్ సిరప్ ఎవరి వద్దనైనా ఉంటే వెంటనే వాడకం ఆపేయాలని.. మార్కెట్లో దీని విక్రయాలను నిలిపివేయాలని తెలంగాణ డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.