భారతదేశం, మే 4 -- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ సత్తా చాటుతోంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే కూటములకు గట్టి పోటీనిస్తూ దాదాపు 82 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. ఎంజీఆర్ తర్వాత ఆ స్థాయిలో ప్రజాభిమానం పొందుతున్న విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తున్నారా అన్న చర్చ మొదలైంది.
తమిళనాడు అంటేనే సినిమా, రాజకీయం విడదీయలేని బంధం. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాల తర్వాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్, ఇప్పుడు ఎన్నికల బరిలోనూ తన సత్తా చాటుతున్నారు. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి టీవీకే అభ్యర్థులు పటిష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా యువత, తొలిసారి ఓటు వేస్తున్న ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపినట్లు ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ-అన్నాడీఎంకే కూటమి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.