భారతదేశం, నవంబర్ 6 -- తీవ్ర తుఫాన్ 'మురసు' సృష్టించిన భీభత్సం ఆంధ్రప్రదేశ్ తీరంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తుఫాన్ తీవ్రతకు సముద్రంలో చెలరేగిన అలల ధాటికి బోటు బోల్తా పడి తమిళనాడుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక సమాచారం ప్రకారం.... తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు మురసు తుఫాన్ నేపథ్యంలో తమ బోట్లతో ఆంధ్రప్రదేశ్ రేవులకు చేరుకుని ఆశ్రయం పొందారు. నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు వద్ద మురాసు తుఫాన్ తీరం దాటిన సంగతి తెలిసిందే. ముందస్తు జాగ్రత్తగా రామాయపట్నం వద్ద మూడు, నిజాంపట్నంలో ఒక బోటును లంగరు వ...