తమిళనాడు పెట్టుబడుల సీక్రెట్స్ ఏపీకి లీక్.. సీఎం విజయ్ సీరియస్.. 15 మంది ఉద్యోగులపై వేటు!
భారతదేశం, నవంబర్ 19 -- విశాఖ సీఐఐ సమ్మిట్ మీద తమిళనాడులో పొలిటికల్ వార్ నడుస్తోంది. తమిళనాడుకు రావాల్సిన భారీ పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లీక్ చేశారనే ఆరోపణలతో 15 మంది ఉద్యోగులను విధుల నుండి తొలగించారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడుల ఆకర్షణపై సలహాలు ఇచ్చే ప్రధాన సంస్థ గైడెన్స్ తమిళనాడులో పనిచేస్తున్న 15 మంది కాంట్రాక్టు ఉద్యోగులపై ఈ మేరకు వేటు పడింది.
ఇటీవలి కాలంలో తమిళనాడుకు రావాల్సిన అనేక ప్రతిష్టాత్మక పరిశ్రమలు, పెట్టుబడులు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయని తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను అధికార టీవీకే ఖండిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే, రాష్ట్ర పెట్టుబడుల రహస్యాలను ఏపీకి చేరవేస్తున్నారనే కారణంతో 15...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.