భారతదేశం, మే 7 -- గత 50 ఏళ్లుగా డీఎంకే, అన్నాడీఎంకేల చుట్టూ తిరిగిన తమిళ రాజకీయాల్లో విజయ్ ప్రవేశం ఒక సంచలనం. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో 108 స్థానాలు గెలుచుకున్న టీవీకే, మేజిక్ ఫిగర్ 118 ని అందుకోలేకపోయింది. కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతుతో ప్రస్తుతం విజయ్ బలం 113కు చేరింది. బుధవారం సాయంత్రం గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిసిన విజయ్, తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, గవర్నర్ మాత్రం తక్షణమే ఆహ్వానించకుండా చట్టపరమైన సలహాలు తీసుకోవాలని నిర్ణయించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

విజయ్ మద్దతు లేఖలు అందజేసినా, గవర్నర్ కార్యాలయం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. "విజయ్‌కు పూర్తిస్థాయి మెజారిటీ ఉందో లేదో నిర్ధారించుకోవాలని గవర్నర్ భావిస్తున్నారు" అని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, 16వ అసెంబ...