భారతదేశం, నవంబర్ 16 -- కోలీవుడ్‌లో రీసెంట్‌గా 'జో' అంటూ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించిన నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. ఈ విజన్ మూవీ సంస్థ నుంచి తదుపరి ప్రాజెక్ట్ ప్రొడక్షన్ నెంబర్ 3ని ప్రారంభించారు. ఈ సినిమా తెలుగు-తమిళ్ అంటూ ద్విభాషా చిత్రంగా రూపు దిద్దుకుంటోంది.

'కోజిపన్నై చెల్లదురై', 'కానా కానమ్ కాలంగల్' వంటి సినిమాల్లో అద్భుతమైన నటనను కనబర్చి అందరినీ ఆకట్టుకున్న ఏగన్.. 'కోర్ట్' చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న శ్రీదేవీ, 'మిన్నల్ మురళి' ఫేమ్ ఫెమినా జార్జ్ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రల్ని పోషించనున్నారు.

ఈ చిత్రం గురించి మేకర్స్ ఈరోజు (నవంబర్ 16) అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు రీసెంట్ సెన్సేషన్ విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 'బేబీ', 'కోర్ట్' అంటూ వరుసగా బ్లాక్ బస్టర్, చార్ట్ బస్టర్ మ్యూజిక్‌ను విజయ్ బుల్గానిని అందించ...