భారతదేశం, డిసెంబర్ 6 -- ఎమోషనల్ థ్రిల్లర్ కథలను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆక‌ర్షిస్తూ వేగంగా ఎదుగుతోన్న‌ నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. డా. అరుళ‌నందు, మాథ్యో అరుళ‌నందు ఆధ్వర్యంలో ఈ నిర్మాణ సంస్థ తమ మూడో చిత్రంగా 'హైకు'ని ప్రకటించింది.

నిర్మాత‌ల్లో ఒక‌రైన డాక్ట‌ర్ అరుళ‌నందు పుట్టిన‌రోజు (డిసెంబ‌ర్ 5) సంద‌ర్భంగా హైకు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. హైకు ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. దీంతో హైకు సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.

ఇకపోతే హైకు సినిమాను తెలుగు, తమిళ, మళయాళం భాషల్లో రూపొందిస్తున్నారు. అలాగే, 'హైకూ' చిత్రంలో ఏగన్ హీరోగా న‌టిస్తున్నారు. ఆయ‌న‌తో పాటు కోర్ట్‌ మూవీ ద్వారా గుర్తింపు పొందిన శ్రీదేవి అపల్ల ప్రధాన పాత్ర పోషిస్తంది. కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి అపల్ల నటిస్తున్న తొలి తమిళ, మలయాళ సినిమా ఇది.

శ్రీదేవి అపల...