భారతదేశం, ఆగస్టు 5 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని, దీనిపై న్యాయవాదులు పోరాడాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తప్పుడు కేసులతో ప్రజల్లో భయం పుట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో ప్రమాదకరమైన అధికార దుర్వినియోగం జరుగుతోందని వైఎస్ జగన్ అన్నారు. "నిజం చెప్పేవారిని, ప్రశ్నించేవారిని అక్రమంగా జైలులో పెడుతున్నారు. రాజకీయ కారణాలతో తప్పుడు కేసులు పెడుతున్నారు. దీనిపై పోరాడటానికి న్యాయవాదులు ముందుకొచ్చి బాధితులకు అండగా నిలబడాలి" అని ఆయన అన్నారు. ప్రస్తుతం న్యాయవాదుల మీద మరింత పెద్ద బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబ...