భారతదేశం, జూలై 23 -- నాగాలాండ్‌కు చెందిన ఒక యువకుడు (ఇన్‌స్టాగ్రామ్‌లో @adiespoems) జంతర్ మంతర్ వద్ద రాత్రింబవళ్లు పోరాడుతున్న విద్యార్థుల పరిస్థితి చూసి చలించిపోయారు. తాను ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనలేకపోయినా, దూరం నుంచే వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జులై 22న సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో డామినోస్ యాప్ ద్వారా ఏకంగా 150 'ఫార్మ్‌హౌస్ చీజ్ బర్స్ట్' (Farmhouse Cheese Burst) పిజ్జాలను ఆర్డర్ చేశారు.

పిజ్జాల అసలు ధర రూ. 64,650 కాగా, పన్నులు, డెలివరీ ఛార్జీలతో కలిపి మొత్తం బిల్లు రూ. 67,734 అయింది. పిజ్జా డెలివరీ చేయడానికి వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేసి 'ఈ పిజ్జాలను ఎవరికి ఇవ్వాలి?' అని అడగ్గా.. ఆ యువకుడు సదరు డెలివరీ బాయ్‌కి ఒక చిన్న సూచన ఇచ్చారు.

"అక్కడ ఇంకా భోజనం చేయకుండా ఆకలితో ఉన్న విద్యార్థులు, నిరసనకారులు ఎవరున్న...