ఢిల్లీలో విద్యార్థులకు సంఘీభావంగా ఇందిరా పార్క్ ధర్నాలో పాల్గొననున్న కేటీఆర్!
భారతదేశం, జూలై 23 -- దేశ రాజధాని న్యూఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన అణచివేత చర్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారతీయ యువత శక్తివంతమైన గొంతుకను, వారి ఆకాంక్షలను పోలీసు బలగాల ప్రయోగంతో నొక్కేయడం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆయన తన అధికారిక సోషల్ మీడియా వేదిక (X) ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో విద్యార్థి లోకం ఎదుర్కొంటున్న దాష్టీకానికి వ్యతిరేకంగా, వారికి సంఘీభావం తెలపడానికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు.
జులై 24 ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్లో ధర్నా ఉండనుంది. ఈ ఆందోళన కార్యక్రమంలో నేరుగా పాల్గొననున్నట్లు కేటీఆర్ స్వయంగా ప్రకటించారు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.