భారతదేశం, సెప్టెంబర్ 16 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే ఆటోడ్రైవర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. వాహన మిత్ర పథకం కింద ఏడాదికి రూ.15 వేలను ఆటోడ్రైవర్ల ఖాతాలో జమ చేయనుంది. దసరా కానుకగా ఈ డబ్బులు వేయనున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఇందుకోసం ముఖ్యమైన పత్రాలు ఆటోడ్రైవర్లు సిద్ధం చేసుకోవాలి.

అర్హత ఉన్న ఆటోడ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద ఒక్కొక్కరికి రూ.15 వేలు రానున్నాయి. ఇందుకోసం మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 17 నుంచి 19వ తేదీ వరకు గ్రామ/వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవాలి. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫారమ్ కూడా అందుబాటులోకి వచ్చింది.

దరఖాస్తుదారుని పేరు, తండ్రిపేరు, ఆధార్ నెంబర్, మెుబైల్ నెంబర్, కులము-ఉపకులం, కుల ధృవీకరణ పత్రం నెంబర్, బ్యాంకు వివరాలు(అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, బ్రాంచ్...