భారతదేశం, మార్చి 17 -- గ్లోబల్ టెక్ దిగ్గజం డెల్ టెక్నాలజీస్ (Dell Technologies) భారీ స్థాయిలో ఉద్యోగులను తగ్గించింది. సోమవారం (మార్చి 16) విడుదల చేసిన కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో తమ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 10 శాతం మందిని, అంటే సుమారు 11,000 మంది ఉద్యోగులను కంపెనీ తొలగించింది.

గత ఏడాది జనవరి నాటికి డెల్‌లో 1,08,000 మంది ఉద్యోగులు ఉండగా, ఈ ఏడాది జనవరి 31 నాటికి ఆ సంఖ్య 97,000కి పడిపోయిందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. వరుసగా రెండో ఏడాది కూడా డెల్ 10 శాతం మేర సిబ్బందిని తగ్గించుకోవడం గమనార్హం. 2025 ఆర్థిక సంవత్సరంలో కూడా కంపెనీ ఇదే తరహాలో లేఆఫ్స్ ప్రకటించింది.

ఈ లేఆఫ్స్‌కు ప్రధాన కారణం కంపెనీ అనుసరిస్తున్న కొత్త 'AI స్ట్రాటజీ' అని తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్...