భారతదేశం, అక్టోబర్ 20 -- దివ్యాంగుల ఆర్థిక రక్షణ, వారి స్వయం సమృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల కోసం 6,997 కొత్త స్వయం సహాయక సంఘాలను (SHG) ఏర్పాటు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనితో పాటు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్(DRF) భాగస్వామ్యంతో దివ్యాంగులకు స్వయం ఉపాధి, ఉపాధి అవకాశాలను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.

తెలంగాణ పట్టణ పేదరికా నిర్మూలన సంస్థ(MEPMA), డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ మధ్య ఈ మేరకు అవగాహనా ఒప్పందం కుదిరింది. 20 నుండి 45 సంవత్సరాల వయస్సు కలిగిన 3,000 మందికి పైగా ఆసక్తి, అర్హత ఉన్న దివ్యాంగులను గుర్తించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే చిన్నపాటి వ్యాపారాలు చేస్తున్న వారిని లేదా కొత్తగా సొంతంగా వ్యాపారం ప్రారంభించాల...