భారతదేశం, నవంబర్ 22 -- సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, డిసెంబర్ 1, 2026 నుండి ఆలయాన్ని సందర్శించే భక్తుల కోసం సాంప్రదాయ దుస్తుల నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె. వెంకట రావు మాట్లాడుతూ.. దర్శనం కోసం వచ్చే భక్తులు, వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులందరూ సాంప్రదాయ దుస్తుల నిబంధనలను పాటించాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ కొత్త దుస్తుల నిబంధనల గురించి భక్తులకు అవగాహన కల్పించేందుకు ఆలయ యంత్రాంగం ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. ఆలయ ప్రాంగణంలోని పలు ముఖ్యమైన ప్రదేశాల్లో, పాటించాల్సిన దుస్తుల నియమాల గురించి వివరిస్తూ సమాచార బోర్డులను ఏర్పాటు చేశారు.

నిబంధనల ప్రకారం పురుష భక్తులు ధోవతి, అంగవస్త్రం, కుర్తా-పైజామా, లేదా సాంప్రదాయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఫార్మల్ షర్టు...