భారతదేశం, నవంబర్ 27 -- ఏడాది చివరి నెలైన డిసెంబర్‌లో గ్రహాల గమనంలో పెద్ద కదలికలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నెల తొలి 13 రోజులు ఎంతో కీలకంగా మారుతున్నాయి. ఈ 13 రోజుల వ్యవధిలో ఐదు గ్రహాల స్థానచలనం దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. వాటి ఫలితాలు ద్వాదశ రాశుల వారిపై పడతాయి. మొదట డిసెంబర్ ప్రారంభంలో బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మూడు రాశుల వారికి విశేషంగా నిలుస్తుంది. తులా రాశి వారికి బుధుడు మంచి ఫలితాలు ఇస్తాడు.

రాహువు, బుధుడు ఇద్దరూ బలంగా ఉంటే ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు దక్కుతాయి. ఆ తర్వాత ఛాయా గ్రహాలైన రాహు-కేతువులు డిసెంబర్ 5న మకరం, కర్కాటక రాశుల్లోకి మారుతారు. డిసెంబర్ 11న శని ప్రత్యక్ష గమనంలోకి వస్తాడు. డిసెంబర్ 13న గురువు వక్రగతిలోకి అడుగుపెడతాడు. ఇలా తొలి 13 రోజుల్లో చోటు చేసుకునే మార్పులతో ఏ రాశులు ముందుకెళ్తాయి, ఏ రాశులకు మధ్...