భారతదేశం, డిసెంబర్ 17 -- జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. జస్టిస్ బొల్లం విజయసేన్ రెడ్డితో కూడిన హైకోర్టు సింగిల్ బెంచ్.. డివిజన్ల వారీగా జనాభా వివరాలను, మ్యాప్‌లను 24 గంటల్లోగా పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను ఆదేశించింది.

వార్డుల వారీగా జనాభా డేటాను ప్రచురించిన తర్వాత అభ్యంతరాల స్వీకరణను ఆ తర్వాత రెండు రోజులుపాటు స్వీకరించాలని చెప్పింది. డివిజన్ల విభజన ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి, పౌరులు తమ అభ్యంతరాలను చెప్పేందుకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.

డిసెంబర్ 9న విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను నిలిపివేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని అలియాబాద్‌లోని పద్మావతి నిలయానికి చెందిన పొన్నా వెంకట్ రమణ ఈ పిటిషన్ దాఖలు చేశ...